JNST Notification 2025 : జవహర్‌ నవోదయ సెలక్షన్‌ టెస్ట్‌–2025 నోటిఫికేషన్‌ విడుదల..

దేశవ్యాప్తంగా ఉన్న 653 నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌–2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 

»    మొత్తం సీట్ల సంఖ్య: 653.
»    తెలుగు రాష్ట్రాల్లో జేఎన్‌వీలు: తెలంగాణ–09, ఆంధ్రప్రదేశ్‌–15 విద్యాలయాలున్నాయి.
»    అర్హత: 2024–25 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ 
ఉండాలి. 01.05.2013 నుంచి 31.07.2015 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులు.
»    ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
»    పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు 80 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఉంటాయి. మెంటల్‌ ఎబిలిటీ(40 ప్రశ్నలు, 50 మార్కులు), అర్థమేటిక్‌(20 ప్రశ్నలు, 25 మార్కులు), లాంగ్వేజ్‌(20 ప్రశ్నలు, 25 మార్కులు) సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఓఎంఆర్‌ సీట్‌లో నాలుగు ఆప్షన్స్‌లో ఒకటి సమాధానం పెన్‌ సాయంతో దిద్దాలి. బ్లూ/బ్లాక్‌ బాల్‌ 
పాయింట్‌ పెన్‌ ఉపయోగించాలి. పరీక్ష సమయం రెండు గంటలు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.09.2024
»    వెబ్‌సైట్‌: www.navodaya.gov.in

Budget 2024-25: కేంద్ర ఆర్థిక సర్వే 2023-24 విడుదల.. ముఖ్యాంశాలు ఇవే.. 

#Tags