APRJC CET 2024 Notification: ఏపీఆర్‌జేసీ సెట్‌ 2024 నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం ఇలా..

గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌(ఇంగ్లిష్‌ మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఏపీఆర్‌జేసీ సెట్‌–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10(బాలురు, బాలికలు) గురుకుల జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి.

మొత్తం సీట్ల సంఖ్య: 1149.
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ.
అర్హత: 2023–24 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్, స్పెషల్‌ కేటగిరీ, స్థానికత ఆధారంగా సీట్లును కేటాయిస్తారు.

పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 150 మార్కులకు ఉంటుంది. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్‌ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ/ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.03.2024
ప్రవేశ పరీక్షతేది: 25.04.2024.

వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in/

చదవండి: Admission in Sainik Schools: సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్‌ ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇలా..

#Tags