Free Civils Coaching : టీఎస్‌ బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత సివిల్స్ లాంగ్ ట‌ర్మ్ కోచింగ్‌కు ద‌ర‌ఖాస్తులు..

హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ ఎంప్లాయ్‌బిలిటీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌.. ఆధ్వర్యంలో టీఎస్‌ బీసీ స్టడీ సర్కిల్‌ సివిల్‌ సర్వీస్‌ లాంగ్‌ టర్మ్‌ (ప్రిలిమ్స్‌–కమ్‌–మెయిన్స్‌) ఎగ్జామినేషన్‌–2025కు సంబంధించి ఉచిత కోచింగ్‌ అందిస్తోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

»    అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5 లక్షలు మించకూడదు. వయసు 32ఏళ్ల లోపు ఉండి సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 50 సీట్లను కేటాయించారు.
»    సీట్లు: 150 (బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఇతరులకు 5శాతం సీట్లను కేటాయించారు).
»    కోచింగ్‌ తేదీలు: 18.07.2024 నుంచి 18.04.2024 వరకు
»    కోచింగ్‌ ప్రదేశం: టీజీ బీసీ స్టడీ సర్కిల్, లక్ష్మీనగర్‌ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్‌.
»    ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్‌ రూల్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 19.06.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.07.2024.
»    ప్రవేశ పరీక్ష తేది: 07.07.2024.
»    పరీక్ష ఫలితాల వెల్లడితేది: 10.07.2024.
»    తరగతుల ప్రారంభం: 18.07.2024.
»    వెబ్‌సైట్‌: https://studycircle.cgg.gov.in

Long Term NEET Coaching : ఎస్టీ గురుకుల్లాల్లో ఉచిత లాంగ్‌ టర్మ్‌ నీట్‌ కోచింగ్‌

#Tags