PG Diploma Courses: షుగర్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా కోర్సులు.. ద‌రఖాస్తుల‌కు చివ‌రి తేదీ..!

మనం తినే తియ్యని పదార్థాల్లో చక్కెర తప్పనిసరి. చెరకు నుంచి వచ్చే ఈ చక్కెర తయారీ వెనుక ఎంతో సాంకేతికత, మానవ శ్రమ దాగి ఉంటుంది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: చక్కెర తయారీ సంస్థలకు సంబంధిత విభాగంలో నైపుణ్యం ఉన్న మానవ వనరుల అవసరం ఉంటుంది. చక్కెర రంగానికి అవసరమైన మానవ వనరులను అందించడంలో కాన్పూర్‌లోని నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు మంచి పేరుంది. ప్రస్తుతం ఈ సంస్థ పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికే షన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయా కోర్సుల వివరాలు..  


కోర్సు వ్యవధి: ఈ కోర్సులో మొ­త్తం 66 సీట్లున్నాయి. కోర్సు కాలవ్యవధి రెండున్నరేళ్లు ఉంటుంది.
అర్హత: బీఎస్సీ ఎంపీసీ లేదా కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

షుగర్‌ ఇంజనీరింగ్‌

  • ఈ కోర్సులో మొత్తం సీట్ల సంఖ్య 40.
  • కోర్సు వ్యవధి 18 నెలలు. మెకానికల్‌ /ప్రొడక్షన్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో బీటెక్‌ లేదా ఏఎంఐఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Indian Air Force jobs: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు

ఇండస్ట్రియల్‌ ఫర్మెంటేషన్‌ అండ్‌ అల్కహాల్‌ టెక్నాలజీ
ఇందులో మొత్తం 50 సీట్లు ఉన్నాయి.
కోర్సు కాలవ్యవధి 18 నెలలు.
అర్హత: బీఎస్సీలో కెమిస్ట్రీ/అప్లయిడ్‌ కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీల్లో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. లేదా బీటెక్‌ బయోటెక్నాలజీ/కెమికల్‌ ఇంజనీరింగ్‌/బయో కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకోవాలి. 

ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌  ప్రాసెస్‌ కంట్రోల్‌
ఈ కోర్సుల్లో మొత్తం సీట్లు 17 ఉన్నాయి.
అర్హత: ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్‌ తదితర విభాగాల్లో బీటెక్‌ లేదా ఏఎంఐఈ పూర్తిచేసి ఉండాలి.

క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌
ఈ కోర్సులో మొత్తం 22 సీట్లున్నాయి. కాలవ్యవధి ఏడాది. అర్హత: బీఎస్సీ ఎంపీసీ లేదా బీజడ్‌సీ లేదా బీఎస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ లేదా బీఎస్సీ/బీటెక్‌ బయోటెక్నాలజీ ఉత్తీర్ణత ఉండాలి.

May 27th Holiday : మే 27వ తేదీన‌ సెల‌వు.. ఎందుకంటే..?

సర్టిఫికేట్‌ కోర్సులు
షుగర్‌ బాయిలింగ్‌: ఈ కోర్సులో మొత్తం 63 సీట్లున్నాయి. పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు కాలవ్యవధి 18 నెలలు.
షుగర్‌ ఇంజనీరింగ్‌: ఈ కోర్సులో మొత్తం 17 సీట్లున్నాయి. కోర్సు కా­లవ్యవధి సంవత్సరం. అర్హత: మెకానికల్‌/ప్రొడక్షన్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో డిప్లొమా ఉండాలి.
క్వాలిటీ కంట్రోల్‌: ఈ కోర్సులో మొత్తం 30 సీట్లున్నాయి. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు కాలవ్యవధి 4 నెలలు ఉంటుంది.

ఎంపిక ఇలా
అర్హత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశం పొందిన వారికి స్కాలర్‌షిప్పులు, స్టైపెండ్‌ లభిస్తాయి. కోర్సులను పూర్తిచేసుకున్నవారు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.

Diploma in Pharmacy Courses: డీఫార్మసీ కోర్సులో ప్రవేశాలు

ఉద్యోగాలు
ఈ కోర్సులను పూర్తిచేసుకున్న వారిని షుగర్‌ ఫ్యాక్టరీలు, స్పిరిట్, డిస్టిలరీ, బ్రువరీలు, బేవరేజ్‌లు తదితర సంస్థలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. అలాగే ఈ కోర్సులు పూర్తిచేసుకున్న వారికి విదేశాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ముఖ్యసమాచారం

  •     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2024, మే 24 
  •     పోస్ట్‌ ద్వారా ప్రింట్‌ అవుట్‌ స్వీకరణ గడువు: 2024, మే 31
  •     రాత పరీక్ష తేదీ: 2024, జూన్‌ 23 
  •     పరీక్ష కేంద్రాలు: పుణె, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, కాన్పూర్, పట్నా.
  •     వెబ్‌సైట్‌: https://nsi.gov.in

 Job Opportunity: యువతకు ఉద్యోగ అవకాశాలు

#Tags