Admissions in APTWREIS: ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో బ్యాక్‌లాగ్ సీట్లలో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్).. ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు; అదేవిధంగా 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాగ్‌లాగ్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, విద్య అందిస్తారు. గిరిజన, ఆదివాసీ గిరిజన, సంచార గిరిజన తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: ఆరో తరగతిలో ప్రవేశాలు పొందాలనుకొనే విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదివి ఉండాలి. 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి వరుసగా 6, 7, 8 తరగతుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు.
వయసు: 31.03.2024 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 13 ఏళ్లు, ఏడో తరగతికి 11 నుంచి 14 ఏళ్లు, ఎనిమిదో తరగతికి 12 నుంచి 15 ఏళ్లు, తొమ్మిదో తరగతికి 13 నుంచి 16 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.03.2024
ప్రవేశ పరీక్ష తేది: 13.04.2024.
వెబ్‌సైట్: https://twreiscet.apcfss.in/
చదవండి: TS EdCET 2024: టీఎస్ ఎడ్‌సెట్–2024 నోటిఫికేషన్.. పరీక్ష విధానం ఇలా..
#Tags