President draupadi murmu News: టీచర్‌గా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
భారత రాష్ట్రపతిగా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న ద్రౌపది ముర్ము తనకెంతో ఇష్టమైన టీచర్‌గా అవతరించారు.
కొత్తఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో కాసేపు ఉపాధ్యాయురాలిగా మారిపోయారు. 9వ తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉత్సాహంగా గడిపారు. గ్లోబల్ వార్మింగ్ , పర్యావరణం లాంటి వంటి ముఖ్యమైన సమస్యలను చర్చించారు.
Anganwadi 9000 jobs news: గుడ్‌న్యూస్ అంగన్‌వాడీలో 9వేల ఉద్యోగాలు.. Click Here
పర్యావరణాన్ని పరిరక్షించడానికి వివిధ మార్గాలను విద్యార్థులకు సూచించారు.
ఈసందర్భంగాకి నీటి సంరక్షణ, అడవుల పెంపకం ప్రాముఖ్యతను వివరించారు. ఎక్కువ మొక్కలు నాటాలని, నీటి వృథాను అరికట్టాలని, వర్షపు నీటి సంరక్షణ ద్వారా వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి)’ ప్రతిపాదనను గుర్తు చేశారు. ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజున ఓ మొక్క నాటాలని పిలుపునిచ్చారు. వాయు కాలుష్యం గురించి కూడా ఆమె ప్రస్తావించారు." ద్రౌపది ముర్ము మీతో సంభాషించడం నిజంగా చాలా ఆనందాన్నించ్చిందనీ, మీ అందరి నుండి చాలా నేర్చుకునే అవకాశం తనకు లభించిందంటూ సంతోషాన్ని ప్రకటించారు