AP PHC Doctors : ప్ర‌భుత్వానికి వైద్య సంఘం లేఖ‌.. ఈ జీవోను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్‌..!

జీవో నంబర్‌ 85ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీల) వైద్యులు డిమాండ్‌..

అమరావతి/గుంటూరు మెడికల్‌: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇన్‌సర్వీస్‌ కోటా కుదింపునకు సంబంధించిన జీవో నంబర్‌ 85ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీల) వైద్యులు డిమాండ్‌ చేశారు.

Join our WhatsApp Channel (Click Here)

ఈ మేరకు శనివారం ప్రభుత్వానికి ఏపీ పీహెచ్‌సీ వైద్యుల సంఘం లేఖ రాసింది. ‘నిర్దేశిత పరీక్షకు కేవలం 20 రోజుల ముందు ప్రభుత్వం ఇన్‌సర్వీస్‌ కోటాను కుదిస్తూ నిర్ణయం తీసుకుని జీవో 85ను జారీ చేసింది.

Private Schools Association : నేడు ప్రైవేట్ పాఠ‌శాలల‌ సంఘం స‌భ్య‌స‌మావేశం..

దీంతో మాకు న్యాయపరమైన మార్గం చూసుకునే అవకాశం లేకుండాపోయింది. జీవో 85పై మేము జూలై 23న వైద్య శాఖ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించాం.

Join our Telegram Channel (Click Here)

ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లకు వినతిపత్రాలు సమర్పిం­చాం. గత 50 రోజులుగా మా బాధను చెబుతూనే ఉన్నాం. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇక దిక్కుతోచని స్థితిలో ఆందోళన బాటపట్టాం.

Follow our YouTube Channel (Click Here)

జీవో 85 రద్దు చేసి.. ఇప్పటికే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు మరిన్ని పీజీ సీట్లు ఇవ్వడం వల్ల మొత్తం ఆరోగ్య వ్యవస్థ బలోపేతం అవుతుంది. మా డిమాండ్లు అన్నింటినీ వెంటనే పరిష్కరించండి’ అని ప్రభుత్వాన్ని పీహెచ్‌సీ వైద్యుల సంఘం డిమాండ్‌ చేసింది.

Telangana Outsourcing jobs: 10వ తరగతి అర్హతతో తెలంగాణలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు...నెలకు జీతం 22,750

గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు శనివారం కూడా తమ నిరసన కొనసాగించారు. పీజీలో ఇన్‌ సర్వీస్‌ కోటాను కుదించడాన్ని ఖండిస్తూ జీవో నంబర్‌ 85ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట వైద్యులు తమ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు.

Follow our Instagram Page (Click Here)

#Tags