SCCL: మెడికల్‌ బోర్డు అవకతవకలపై ఏసీబీ విచారణ

సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఇటీవల జరిగిన మెడికల్‌ బోర్డు నిర్వహణలో జరిగిన అవకతవకలపై ఏసీబీ అధికారులు మే 28న‌ విచారణ చేపట్టారు.

కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఓ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం, సింగరేణి మెయిన్‌ ఆస్పత్రిలో సాయంత్రం విచారణ చేసినట్లు తెలిసింది. మెడికల్‌ బోర్డ్‌ జాబితాలో ఉన్న ఉద్యోగులను వేర్వేరుగా పిలిచి...మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ కావడానికి గల కారణాలు, వారికి ఉన్న జబ్బుల వివరాలపై ఆరా తీశారు.

చదవండి: SCCL: ఉచితంగా వేసవి శిక్షణ శిబిరాలు

మెడికల్‌ బోర్డు నిర్వహణలో దళారీ వ్యవస్థను రూపుమాపే బాధ్యతను సీఎండీ ఎన్‌.బలరామ్‌ ఇటీవల ఏసీబీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టడంతో దళారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వీరు కొంతకాలంగా ప్రజాప్రతినిధులు, యూనియన్‌ నాయకుల అండతో మెడికల్‌బోర్డు నిర్వహణలో దందాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

#Tags