Junior Assistant Jobs: తెలంగాణ మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ మున్సిపాలిటీలలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. మొత్తం 316 పోస్టులను మంజూరు చేస్తూ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేసారు.
భర్తీ చేయబోవు ఈ ఉద్యోగాలలో మున్సిపల్ కమిషనర్లు (గ్రేడ్ -1, గ్రేడ్ -2 & గ్రేడ్ -3) , హెల్త్ ఆఫీసర్లు, రెవెన్యూ మేనేజర్లు , శానిటరీ సూపర్వైజర్ లు , శానిటరీ ఇన్స్పెక్టర్ , హెల్త్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కలవు.
రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ: తెలంగాణ మున్సిపల్ శాఖ
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 316
భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
గ్రేడ్ -1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు – 7
గ్రేడ్ -2 అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు – 43
గ్రేడ్ -3 మున్సిపల్ కమిషనర్లు – 41
హెల్త్ ఆఫీసర్లు – 7
రెవెన్యూ మేనేజర్లు – 11
సానిటరీ సూపర్వైజర్ – 10
సానిటరీ ఇన్స్పెక్టర్ – 86
హెల్త్ అసిస్టెంట్ – 96
జూనియర్ అసిస్టెంట్ ( HDO & రీజినల్ ఆఫీస్ ) – 15
విద్యార్హత:
ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
వయస్సు:
18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల లోపు గా వయస్సు వున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
ఎంపిక విధానం:
వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
జీతం:
ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా 40వెలకి పైగా జీతం లభిస్తుంది.
పరీక్ష కేంద్రాలు:
రాష్ట్రంలో ప్రముఖ నగరాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
నోట్ : ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ కి మరికొద్ది రోజులలో విడుదల కానుంది , కావున అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక పూర్తి నోటిఫికేషన్ చదివి ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.