Tailoring Courses: టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తులు

Tailoring Courses

ఫిబ్రవరి –2024లో ప్రభుత్వం నిర్వహించనున్న డ్రాయింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు www. bse.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసి సంబంధిత సర్టిఫికెట్లు, చలానాను డీఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

డ్రాయింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ లోయర్‌ గ్రేడ్‌, హయ్యర్‌గ్రేడ్‌ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు పరీక్ష ఫీజును ఈ నెల 29లోగా చెల్లించాలని పేర్కొన్నారు. డ్రాయింగ్‌ లోయర్‌ గ్రేడ్‌కు పరీక్ష ఫీజు రూ.100, హయ్యర్‌ గ్రేడ్‌కు రూ.150, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ లోయర్‌ గ్రేడ్‌కు రూ.150, హయ్యర్‌గ్రేడ్‌కు రూ.200 పరీక్ష ఫీజు ఉంటుందని తెలిపారు.

రూ.50 అపరాధ రుసుంతో వచ్చే నెల 5లోగా, రూ.75 అపరాధ రుసుంతో వచ్చే నెల 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. లోయర్‌ గ్రేడ్‌ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, హయ్యర్‌కు దరఖాస్తు చేసే వారు లోయర్‌ గ్రేడ్‌ టెక్నికల్‌ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు.

#Tags