School Assistant Certificates: స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులకు సర్టిఫికెట్లు

School Assistant Certificates

పాడేరు రూరల్‌ : ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ సైన్స్‌) పోస్టులకు పదోన్నతులు అర్హత కలిగిన ఎస్జీటీలకు అవకాశం కల్పిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఐ.కొండలరావు తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఈనెల 14న పాడేరు గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తామన్నారు. అర్హత కలిగిన సెకెండరీ గ్రేడ్‌ టీచర్స్‌ ఫిజికల్‌ సబెక్టులో ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

#Tags