RTC Jobs: RTCలో ఉద్యోగాలు..

RTC Jobs

ఏపీఎస్‌ ఆర్టీసీలో అప్రెంటీస్‌షిప్‌ చేసేందుకు ఆసక్తిగల ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ కర్నూలు జోనల్‌ సిబ్బంది శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.నజీర్‌ అహ్మద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

వైఎస్సార్‌ జిల్లాలో డీజిల్‌ మెకానిక్‌ 47, మోటారు మెకానిక్‌ 8, ఎలక్ట్రిషియన్‌ 4, వెల్డర్‌ 1, పెయింటర్‌ 1, మిషనిస్టు 2, ఫిట్టర్‌ 2, డ్రాఫ్ట్‌ సివిల్‌ 2 కలిపి మొత్తం 67 మందికి ప్రవేశం కల్పిస్తామన్నారు.

నవంబరు 1 నుంచి 15వ తేదీలోగా అభ్యర్థులు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ https://www.apsrtc.ap.gov.in/Recruitments.php లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 7382869399, 7382873146 నంబర్లలో సంప్రదించాలన్నారు.

పూర్తి వివరాల కోసం: Click Here

#Tags