NCERT 170 Vacancies- వివిధ పోస్టుల్లో ఖాళీలు.. నెలకు రూ. 80వేల జీతం

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(NCERT)లో అసిస్టెంట్ ఎడిటర్, ప్రూఫ్ రీడర్, డీటీపీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(NCERT)లో అసిస్టెంట్ ఎడిటర్, ప్రూఫ్ రీడర్, డీటీపీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీల సంఖ్య: 170

అసిస్టెంట్‌ ఎడిటర్‌ పోస్టులు
అసిస్టెంట్‌ ఎడిటర్‌(ఇంగ్లీష్‌)- 25 పోస్టులు
అసిస్టెంట్‌ ఎడిటర్‌(హిందీ)- 25 పోస్టులు
అసిస్టెంట్‌ ఎడిటర్‌(ఉర్దూ)- 10 పోస్టులు

అర్హత: 
గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ
బుక్ పబ్లిషింగ్/ మాస్ కమ్యూనికేషన్/ జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
ఎడిటింగ్‌,ప్రొడ్యూసింగ్‌, మోనోగ్రాఫ్స్‌, పాఠ్యపుస్తకాల పబ్లిషింగ్‌లో కనీసం 5 ఏళ్ల అనుభవం
పుస్తకాల తయారీ,ప్రింటింగ్‌లో ఆధునిక ప్రక్రియ, టైపోగ్రఫీ,ఇంగ్లీష్/హిందీ/ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

వయస్సు: 50 ఏళ్లకు మించరాదు
వేతనం: నెలకు రూ.80,000/.

ప్రూఫ్‌ రీడర్‌ పోస్టులు:
ప్రూఫ్‌ రీడర్‌(ఇంగ్లీష్‌)-25 పోస్టులు
ఫ్రూఫ్‌ రీడర్‌(హిందీ)- 25 పోస్టులు
ఫ్రూఫ్‌ రీడర్‌(ఉర్దూ)- 10 పోస్టులు

అర్హత
ఇంగ్లీష్/హిందీ/ఉర్దూ భాషల్లో బ్యాచిలర్ డిగ్రీ
కాపీ హోల్డర్/ప్రూఫ్ రీడర్‌గా ప్రింటింగ్ లేదా పబ్లిషింగ్ ఆర్గనైజేషన్‌లో 0-1 ఏళ్ల అనుభవం
కంప్యూటర్‌ పరిజ్ఞానం

వయస్సు: 42 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 37,000/- 

డీటీపీ ఆపరేటర్‌ పోస్టులు:
డీటీపీ ఆపరేటర్‌(ఇంగ్లీష్‌)- 25 పోస్టులు
డీటీపీ ఆపరేటర్‌(హిందీ)- 25 పోస్టులు
డీటీపీ ఆపరేటర్‌(ఉర్దూ)- 10 పోస్టులు

అర్హత
ఏదైనా విభాగంలో బ్యాచ్‌లర్‌ డిగ్రీ
గుర్తింపు పొందిన సంస్థ నుండి డెస్క్ టాప్ పబ్లిషింగ్‌లో ఒక సంవత్సరం డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సు
పాఠ్యపుస్తకాల తయారీలో పేరున్న పబ్లిషింగ్ హౌస్‌లో కనీసం 3 ఏళ్ల అనుభవం.
ఎక్సెల్ & పేజ్ మేకర్‌తో సహా ఇన్-డిజైన్, ఫోటోషాప్, ఇలస్ట్రేటర్, ఈక్వేషన్ ఎడిటర్, మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ప్రావీణ్యం
హిందీ ,ఇంగ్లీషు రెండు సబ్జెక్టుల్లోనూ టైపింగ్‌లో ప్రావీణ్యం.

వయస్సు: 45 ఏళ్లకు మించరాదు
వేతనం: నెలకు రూ. 50,000/-

NCERT రిక్రూట్‌మెంట్ స్క్రీనింగ్, రిజిస్ట్రేషన్‌ తేదీలు: ఫిబ్రవరి 01, 2024 ఉదయం 10-3pm వరకు

ఇంటర్వ్యూ తేదీలు:
అసిస్టెంట్ ఎడిటర్: ఫిబ్రవరి 03, 2024
ప్రూఫ్ రీడర్: ఫిబ్రవరి 02, 2024
DTP ఆపరేటర్లు: ఫిబ్రవరి 02,03 తేదీల్లో.

#Tags