Mega Job Mela: రెండు రోజుల పాటు భారీ ఉద్యోగ మేళా.. 500 పైగా కంపెనీలు..

బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో కర్ణాటక కౌసల్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 26, 27 తేదీల్లో రాష్ట్ర స్థాయి భారీ ఉద్యోగ మేళాను ఏర్పాటు చేశారు.

ఈ మేళాలో సుమారు 500కు పైగా కంపెనీలు, పరిశ్రమల యజమానులు, ఉద్యోగ దాత సంస్థలు పాల్గొంటాయి. ఆసక్తి కలిగిన దివ్యాంగులు ఆన్‌లైన్‌ లింక్‌ను ఓపెన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు తాలూకా పంచాయతీల్లోని వివిధోద్దేశ పునర్వసతి కార్యకర్తలను, సంబంధిత కార్యాలయాన్ని లేదా 0836–2744474 నెంబర్‌లో సంప్రదించాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాను  ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  ప్రారంభించనున్నారు.

Free training in computer courses: కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ

 

#Tags