Skip to main content

Free training in computer courses: కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ

Free training in computer courses
Free training in computer courses

డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సులో శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ ఐటీఐ కళాశాల (స్కిల్‌ హబ్‌) ప్రిన్సిపాల్‌ టి.వి.గిరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని వి.టి.అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్కిల్‌ హబ్‌లో పనిచేయాల్సి ఉంటుందన్నారు.

కంప్యూటర్‌ సైన్‌ డిగ్రీ, ఆపై చదువుకున్న 30 నుంచి 45 ఏళ్లలోపు వయసు ఉన్న అభ్యర్థులు ఈ నెల 23న ఉదయం ఐటీఐ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే ఇంటర్వ్యూకు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సెల్‌: 80745 95942, 77806 58035 నంబర్లను సంప్రదించాలన్నారు.

Published date : 23 Feb 2024 10:18AM

Photo Stories