Mega Job Mela: 16న మెగా జాబ్‌మేళా

కంచరపాలెం: స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌లో శుక్రవారం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి సీహెచ్‌ సుబ్బిరెడ్డి (క్లరికల్‌) తెలిపారు.

అరబిందో స్పైసెస్‌, జాబ్‌ డీలర్స్‌, రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌, సాయి కెమికల్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెస్స్‌, హరీష్‌ ఫుడ్‌ బేవరేజెస్‌, హెటిరో డ్రగ్స్‌ శ్రీరామ ఫైనాన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో 555 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. సర్వీస్‌ అడ్వైజర్‌ టెక్నీషియన్‌, జూనియర్‌ కెమిస్ట్‌, రిటైల్‌ ట్రైనింగ్‌ అసోసియేట్‌, ఫార్మసిస్ట్‌, జూనియర్‌ ట్రైనీ, డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌, ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్స్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, అకౌంట్స్‌, అసిస్టెంట్‌, రికవరీ క్లర్కు, బ్రాంచ్‌ ఇంచార్జ్‌ ఉద్యోగాలకు టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పీజీ, ఎం.ఫార్మసీ ఉత్తీర్ణత సాధించిన 18–42 సంవత్సరాల వయసు కల్గిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆయా ఉద్యోగాల బట్టి జీతం నెలకు రూ10 వేలు నుంచి రూ.18,500ల వరకు ఉంటుందన్నారు. కంచరపాలెం జిల్లా ఉపాఽధి కార్యాలయంలో శుక్రవారం 10 గంటలకు జాబ్‌మేళాకు హాజరుకావాలని ఆయన కోరారు.

చదవండి: Indian Railway Jobs: 5,696 పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్...

#Tags