Junior Lineman jobs news: జూనియర్‌ లైన్‌మెన్ల(జేఎల్‌ఎం)ఎంపిక పరీక్ష ఎప్పుడంటే..

Junior Lineman job

ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి జూనియర్‌ లైన్‌మెన్ల(జేఎల్‌ఎం)ఎంపిక పరీక్ష ఈనెల 22న ఖమ్మం ఎన్పీడీసీఎల్‌ సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఖమ్మం సర్కిల్‌ ఆపరేషన్స్‌ ఎస్‌ఈ ఎ.సురేందర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Students Free Bus Pass news: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..ఇకపై ఉచిత బస్‌పాస్‌

టీజీ ఎన్పీడీసీఎల్‌ రూపొందించిన నిబంధనల ఆధారంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు జేఎల్‌ఎంల పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంపిక పరీక్ష ప్రక్రియ ప్రారంభమవుతుందని, అభ్యర్థులు నిర్దేశించిన ధ్రువీకరణ పత్రాలను అధికారుల పరిశీలనకు అందించాలని సూచించారు. అనంతరం స్తంభం ఎక్కే పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

పరీక్షకు ఎంపికై న వారికి ఇప్పటికే పోస్ట్‌ ద్వారా సమాచారం ఇచ్చామని, అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

#Tags