Job Mela: జాబ్ మేళా... పదో తరగతి అర్హతతో రూ.25 వేల వరకు జీతం!

Latest Job Mela

నల్లగొండ రూరల్: నల్లగొండలోని ఐటీఐ ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 31న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవరెడ్డి గురువారం తెలిపారు. 

అర్హతలు 
ఎస్ఎస్సీ నుంచి డిగ్రీ చదివిన 18 నుంచి 35 సంవత్సరాలు గల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. 

ఇంటర్వ్యూ 
ఆసక్తి గల వారు బయోడేటా, ఒరిజినల్ ధ్రువీకరణపత్రాలు తీసుకుని నేరుగా ఉపాధి కల్పన కార్యాలయానికి హాజరుకావాలని కోరారు.  ఇతర వివరాలకు 78934 20435 ను సంప్రదించాలని పేర్కొన్నారు.

జీతం 
ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం లభిస్తుందని తెలిపారు.

#Tags