Latest Job Mela: జాబ్‌మేళా 1624 మందికి ఉపాధి

Latest Job Mela

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్థానిక గాజులరేగలోని సీతం ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం నిర్వహించిన ప్రాంతీయ మెగా జాబ్‌ మేళాలో 1,624 మందికి ఉపాధి లభించింది.

ఎంపిక ప్రక్రియ అనంతరం జరిగిన కార్యక్రమంలో వారికి నియామక పత్రాలను సీతం ఇంజినీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌, మాజీ ఎంపీ డాక్టర్‌ బొత్స ఝాన్సీలక్ష్మి అందజేశారు.

జాబ్‌ మేళా కు హాజరైన 5,274 మందిని ఇంటర్వ్యూ చే యగా 1,624 మంది వివిధ కంపెనీలలో ఎంపికయ్యారు. మరో 646 మంది తుది రౌండ్‌ కోసం ఎంపికయ్యారని జాబ్‌మేళా నిర్వాహకులు ప్రకటించారు.

#Tags