Jobs for women: మహిళలకు ఉద్యోగాలు
స్విమ్స్ శ్రీ బాలాజి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజిలో క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహణ కోసం ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నట్లు స్విమ్స్ రిజిస్ట్రార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వివిధ కేటగిరి పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసే ఈ పోస్టులకు ఈ నెల 9, 10 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామన్నారు.
మహిళా అభ్యర్థుల పోస్టుల వివరాలు
గైనకాలజీ మెడికల్ ఆఫీసర్– 2, రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ – 2, డెంటిస్ట్రీ మెడికల్ ఆఫీసర్ –2,జ నరల్ సర్జరీ మెడికల్ ఆఫీసర్ –2, స్టాఫ్ నర్స్– 4, ఏఎన్‌ఎం– 4, మమోగ్రఫీ టెక్నీషియన్– 2, కార్డియో వాస్క్యులర్ –2 టెక్నీషియన్– 2, డేటా ఎంట్రీ ఆపరేటర్– 2, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్– 2, మెడికల్ సోషియల్ వర్కర్ –2 పోస్టులకు మహిళలను మాత్రమే నియమించనున్నట్లు తెలిపారు.
ఎలక్ట్రీషియన్ –2, డ్రైవర్స్– 2 పోస్టుల్లో పురుషులను మాత్రమే నియమించనున్నట్లు వివరించారు. అన్ని కేటగిరీల పోస్టులకు హిందువులు మాత్రమే అర్హులని తెలియజేశారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకునిరావాలి అని చెప్పారు.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి టీఏ, డీఏలు చెల్లించేది లేదని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు వెంటనే విధుల్లో చేరాలని, విద్యార్హత, తగిన అనుభవం గల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. రోస్టర్ ప్రకారం పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఇతర వివరాలకు స్విమ్స్ వైబ్సెట్ https://svimstpt. ap.nic.inను సందర్శించవలసిందిగా ఆయన కోరారు.