Invitation of Applications: దరఖాస్తుల ఆహ్వానం

Invitation of Applications

విజయనగరం అర్బన్‌: రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలో కనీసం 10 సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా సేవలు అందించిన వారు అవార్డులకు అర్హులని తెలిపారు. ఉపాధ్యాయులు తమ ప్రతిపాధనలను ఈ నెల 22వతేదీ లోగా మండల విద్యాశాఖాధికారి/డిప్యూటీ ఈఓ కార్యాలయాల ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి అందజేయాలని పేర్కొన్నారు.

#Tags