Jobs: ఈ కోర్సుల‌కు పిచ్చ డిమాండ్‌... ఫ్రెష‌ర్ల‌కే ల‌క్ష‌ల్లో ప్యాకేజీ

శాస్త్ర, సాంకేతికతల సహాయంతో ప్రపంచాన్నే గుప్పిట్లోకి తెచ్చిన శాస్త్రవేత్తలు.. ఇప్పుడు మానవ మేధస్సుకే సవాల్ విసురుతున్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)కు ప్రాణం పోస్తున్నారు. అలా వెలుగులోకి వచ్చిన చాట్‌జీపీటీ, డాల్‌-ఈ, బింగ్‌ ఏఐ, మిడ్‌ జర్నీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సర్వీసులు చాప కింద నీరులా అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఏఐలో నిష్ణాతులైన ఫ్రెషర్స్‌కు ప్రారంభ వేతనం ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.14 లక్షలు ఇచ్చేందుకు టెక్‌ సంస్థలు మొగ్గుచూపుతున్నాయి.

ఎక్కువగా కోరుకునే రంగాలు ఇవే...
ఏఐలో డేటా సైంటిస్ట్‌, ఎంఎల్‌ (Machine Learning) ఉద్యోగాల‌కు డిమాండ్ అధికంగా ఉంది. గ్లోబల్‌ మార్కెట్‌లో సమయం, డబ్బు ఆదా చేస్తూ మిలియన్ల మంది వినియోగదారుల అవసరాలను తీర్చేలా ఈ కోర్సులు ఉన్నాయి. ప్రముఖ ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్ టీమ్‌లీజ్ చేసిన సర్వేలో 37 శాతం సంస్థలు ఏఐ టూల్స్‌పై శిక్ష‌ణ‌ ఇస్తున్నాయి. ఈ విభాగంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 30 శాతం కంపెనీలు ఉద్యోగుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారికి ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అడుగు పెట్టేలా ప్రోత్సహిస్తున్నాయి. ఫ్రెష‌ర్ల‌కు దాదాపు 45 వేల ఉద్యోగాలు ఉన్న‌ట్లు టీమ్‌లీజ్ తెలిపింది.

చ‌ద‌వండి: మీమ్స్ వేస్తే లక్ష రూపాయ‌ల‌తో ఉద్యోగం మీదే
భారత్‌లో వీరికి ఫుల్ డిమాండ్
ఇక, భారత్‌లో ప్రస్తుతం ఫ్రెషర్లగా విధులు నిర్వహించే ఇంజినీర్లకు ఏడాదికి రూ.14 లక్షల వరకు, ఎంఎల్‌ ఇంజినీర్లకు రూ.10 లక్షలు, డేటా సైంటిస్ట్‌లకు రూ.14 లక్షలు, డెవాప్స్‌ ఇంజినీర్లకు రూ.12 లక్షలు, డేటా ఆర్కిటెక్చర్‌కు రూ.12 లక్షలు, బీఐ అనాలసిస్‌కు రూ.14 లక్షలు, డేటాబేస్‌ అడ్మిన్‌కు రూ.12 లక్షల వరకు జీతాలు ఇస్తున్నట్లు టీమ్‌ లీజ్‌ నివేదిక వెల్లడించింది.

#Tags