Job Mela: జాబ్‌మేళా పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు అర్బన్: కనిగిరిలో అక్టోబర్ 13న నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను కలెక్టర్ దినేష్‌కుమార్ అక్టోబర్ 9న స్పందన భవనంలో ఆవిష్కరించారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయింట్, సీడప్ సంయుక్త ఆధ్వర్యంలో కనిగిరి డిగ్రీ కాలేజీలో ఉదయం 9 గంటల నుంచి 12 కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డీఆర్‌ఓ శ్రీలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, డీపీఓ నారాయణరెడ్డి, ఎంప్లాయిమెంట్ అధికారి టి. భరద్వాజ్, డీఎస్‌డీఓ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
#Tags