Gurukula School teaching posts: అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టు భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే మంగళవారం తెలిపారు.
స్థానిక గురుకుల పాఠశాలలో 2023–24కుగాను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఆయన తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంఏ బీఈడీలో 50 శాతం మార్కులు కలిగి ఏపీ టెట్ అర్హత ఉండాలన్నారు.
రెండు లెవెల్స్‌లో ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలని సూచించారు. సంబంధిత సబ్జెక్టులో విద్యార్హత, డెమో ద్వారా వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. అసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20లోగా స్థానిక ఏపీఆర్ పాఠశాలలో దరఖాస్తు అందజేయాలని ఆయన సూచించారు.
#Tags