Gurukula School jobs: గురుకుల పాఠశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Gurukula School jobs

ఏపీ బాలుర గురుకుల పాఠశాలలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయటానికి వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు.

రాజాపేట గురుకుల పాఠశాలలో పనిచేయటానికి పీజీటీ ఫిజికల్‌ సైన్స్‌, పీజీటీ ఇంగ్లిషు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

ఈ పోస్టులకు ఎమ్మెస్సీ బీఈడీ , ఎంఏ బీఈడీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సర్టిఫికెట్‌ జిరాక్సు కాపీలతో స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని కోరారు. పురుష అభ్యర్థులకు ప్రాధాన్యంఉంటుందని తెలిపారు.

#Tags