Jobs news: 108లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Jobs news

మోత్కూరు : 108 వాహనాల్లో ఈఎంటీ, డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ నసీరుద్దిన్‌ తెలిపారు. ఈఎంటీ పోస్టుకు బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌డబ్ల్యూ పూర్తి చేసి 26 ఏళ్ల వయస్సు పైబడిన వారు అర్హులన్నారు. మేనేజర్‌ పోస్టుకు బీటెక్‌ మెకానికల్‌, ఐదేళ్ల అనుభవం, 26 ఏళ్ల వయస్సు పైబడిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 25న జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, జిరాక్స్‌లతో హాజరు కావాలని కోరారు. వివరాలకు 8008935522లో సంప్రదించాలన్నారు.

#Tags