Guest Faculty Jobs: ప్రభుత్వ కళాశాలల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..

Guest faculty jobs

చోడవరం రూరల్‌ : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గె స్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవలసిందిగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.కిరణ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Special leave for Girls: విద్యార్థినులకు ‘ప్రత్యేక’ సెలవు ఎందుకంటే..

కళాశాలలో ఫిజిక్సు సబ్జెక్టు, కంప్యూటర్‌ సైన్సులలో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆయన తెలిపారు. ఎమ్మెస్సీ ఫిజిక్సు, ఎంటెక్‌ కంప్యూటర్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లలో 55 శాతం మార్కులను పొంది ఉండాలన్నారు. పీహెచ్‌డీ, నెట్‌ మరియు స్లెట్‌ అర్హత పొందినవారు, అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరారు.

10వ తేదీ సాయంత్రం కార్యాలయం సమయం లోపల కళాశాలలో దరఖాస్తులను అందచేయాలని కోరారు. అభ్యర్థులు 12వ తేదీన తమ అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలతో మౌఖిక ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావాలని ప్రిన్సిపాల్‌ కిరణ్‌కుమార్‌ కోరారు.

#Tags