Good news Telangana Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా పూర్వప్రాథమిక విద్యను ప్రవేశపెట్టనుండగా.. సూపర్‌వైజర్లు, టీచర్ల శిక్షణ పూర్తి చేసింది. ఈమేరకు సిలబస్ మార్చడంతో పాటు పుస్తకాలు అందజేశారు. అలాగే కేంద్రాలకు పెయింటింగ్‌తో పాటు త్వరలో ఆటవస్తువుల కిట్స్‌ను అందజేయనున్నారు.
Anganwadi 9000 jobs news: గుడ్‌న్యూస్ అంగన్‌వాడీలో 9వేల ఉద్యోగాలు..Click Here
ఆగస్టు 1వ తేదీ నుంచి..
ఆగస్టు 1వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి ప్రీ స్కూల్ విధానాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త సిలబస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈమేరకు విద్యా బోధన చేయనున్నారు. అదే రోజు పిల్లలకు యూనిఫాంల పంపిణీ చేస్తారు.
పెయింటింగ్ పూర్తి ..
ప్రీస్కూల్ విధానం అమలులో భాగంగా జిల్లాలో మొదటి విడతలో 40 కేంద్రాల పెయింటింగ్‌కు నిధులు రాగా.. వాటిలో ఏడు కేంద్రాలకు పెయింటింగ్ వేశారు. జంతువుల బొమ్మలతో పాటు ఏబీసీడీలు ఇతర విద్యకు సంబంధించిన పెయింటింగ్‌లతో పాటు చిన్నచిన్న మరమ్మతులు పూర్తి చేశారు.
సొంత భవనాలు, అద్దె లేకుండా ఉన్న కేంద్రాల్లో పూర్తిస్థాయిలో పూర్వ ప్రాథమిక విద్య చేపట్టేలా 713 కేంద్రాలను ఎంపిక చేశారు. కాగా హ్యాండ్ బుక్ (కరదీపిక), ప్రియదర్శిణి పుస్తకాలు కేంద్రాలకు సరఫరా చేశారు. కాగా 713 కేంద్రాల్లోని పిల్ల లకు మాత్రమే మొదటి విడతలో భాగంగా 8,617 మందికి యూనిఫాంలు సరఫరా చేశారు. మున్సిపాలిటీ పరిధిలో మెప్మా ద్వారా, గ్రామాల్లో డీఆర్‌డీఏ ద్వారా యూనిఫాంలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ పూర్తి చేశారు.
త్వరలో 300 మరుగుదొడ్ల నిర్మాణం..
ప్రీ స్కూల్ విధానంలో భాగంగా కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు జిల్లాకు 300 మరుగుదొడ్లు మంజూరు కాగా, 80 కేంద్రాల్లో తాగు నీటి సౌకర్యంతో పాటు ఇతర నిర్మాణాలు చేయనున్నారు. అందుకు నిధులు మంజూరు కాగా త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
బలోపేతం కోసమే ప్రీ స్కూల్ విధానం
కేంద్రాల బలోపేతం కోసమే ప్రభుత్వం ప్రీ స్కూల్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రీ స్కూల్ విధానం అధికారికంగా అమలు జరుగుతుంది. కేవలం కేంద్రాల బలోపేతం కోసమే పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వం అమలు చేస్తుంది. యూనిఫాంలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే కేంద్రాలకు ఆట వస్తువుల కిట్స్ ప్రభుత్వం నుంచి సరఫరా అవుతాయి.
జిల్లాలో 1,435 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కాగా 335 కేంద్రాలు సొంత భవనాల్లో, 646 కేంద్రాలు అద్దె లేకుండా, 454 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా.. కేంద్రాల పరిధిలో ఏడు నెలల నుంచి ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 34,000 మంది ఉన్నారు. గర్భిణులు 4,398మంది, బాలింతలు 3,884 మంది ఉన్నట్లు అధికారులు తెలి పారు. 1,352 మంది అంగన్‌వాడీ టీచర్లు, 1,114 మంది ఆయాలు విధులు నిర్వర్తిస్తున్నారు. 58మంది సూపర్‌వైజర్లకు 46 మంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.