Free tailoring training for women: మహిళలకు 66 రోజుల ఉచిత టైలరింగ్ శిక్షణ

Free tailoring

అనంతగిరి: ఎస్సీ నిరుద్యోగ మహిళలు ఉచిత టైలరింగ్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్‌ కింద నిరుద్యోగులైన ఎస్సీ మహిళలకు కుట్టు మిషన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా కుట్టు మిషన్‌ ఇస్తారని తెలిపారు.

సికింద్రాబాద్‌ రైల్వేలో భారీగా ఉద్యోగాలు: Click Here

దాని ద్వారా ఉపాధి పొందవచ్చన్నారు. టైలరింగ్‌ శిక్షణకు కనీస విద్యార్హత 5వ తరగతి అని, జిల్లాలో నివసించే 18 నుంచి 35 సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ కేంద్రాల్లో సెంటర్లు ఉన్నాయని తెలిపారు. 66 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తారని చెప్పారు.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జిరాక్స్‌ పత్రులు, ఆధార్‌ కార్డ్‌, కులం, ఆదాయం, విద్యార్హతలు, రెండు పాస్‌ ఫొటోలను కలెక్టరేట్‌లోని ఎస్సీ కార్పొరేషన్‌ ఆఫీసులో అందజేయాలని సూచించారు. ఈ నెల 20వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు. ఇతర సమాచారం కోసం ఫోన్‌ నంబర్ల 08416 255866/98495 82036/93981 93671లో సంప్రదించాలన్నారు.

#Tags