Skip to main content

Secunderabad Railway jobs: సికింద్రాబాద్‌ రైల్వేలో భారీగా ఉద్యోగాలు

Railway jobs  Secunderabad Railway Zone recruitment notification 8,113 total job posts in all railway zones 478 jobs available in Secunderabad zone  Job application period from 14th September to 13th October  Secunderabad Railway recruitment details
Railway jobs

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీల (గ్రాడ్యుయేషన్) లలో చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8113 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతుంది.. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

తాజాగా విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అన్ని జోన్లలో కలిపి 8,113 పోస్టులు ఉండగా సికింద్రాబాద్ జోన్ లో 478 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి కూడా అభ్యర్థులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 13వ తేదీలోపే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియలు నిర్వహించే పరీక్ష కూడా తెలుగులోనే ఉంటుంది.

సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉన్న ఉద్యోగాల ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి. 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

సికింద్రాబాద్ రైల్వే జోన్ లో భర్తీ చేస్తున్న ఉద్యోగాల సంఖ్య : 478

సికింద్రాబాద్ రైల్వే జోన్ భర్తీ చేసే పోస్టులు వివరాలు : చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ అనే ఉద్యోగాలను సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో భర్తీ చేస్తున్నారు. 

సికింద్రాబాద్ రైల్వే జోన్ లో భర్తీ చేసే పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : 

చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్ – 25
స్టేషన్ మాస్టర్ – 10
గూడ్స్ ట్రైన్ మేనేజర్ – 288
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ – 141
 సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ – 14


విద్యార్హత: భర్తీ చేస్తున్న అన్ని రకాల ఉద్యోగాలకు అక్టోబర్ 13వ తేదీ నాటికి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అర్హులు. 

అప్లికేషన్ విధానం : అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే జోన్ యొక్క అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. అప్లై చేసే సమయంలో అభ్యర్థులు తమ వివరాలు అన్నీ సరిగ్గా నమోదు చేసి సబ్మిట్ చేసే ముందు ఒకసారి సరిచూసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 14వ తేదీ నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. 

అప్లికేషన్ చివరి తేదీ: ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 13వ తేదీ లోపు సబ్మిట్ చేయాలి. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ , ఎస్టీ, ఈబీసీ, మహిళలు, మైనారిటీలు, ట్రాన్స్ జెండర్, PwBD అభ్యర్థులు 250/- రూపాయలు ఫీజు చెల్లించాలి. వీరు CBT-1 పరీక్ష రాసిన తర్వాత పూర్తి ఫీజు బ్యాంకు చార్జీలు మినహాయించి రిఫండ్ చేస్తారు. 

మిగతా క్యాటగిరీల అభ్యర్థులు 500 రూపాయలు ఫీజును చెల్లించాలి. ఈ అభ్యర్థులు CBT-1 పరీక్ష రాసిన తర్వాత 400 రూపాయలు ఫీజులు బ్యాంకు చార్జీలు మినహాయించి రిఫండ్ చేస్తారు. 

ఉద్యోగాలు ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు CBT -1 , CBT-2 పరీక్షలు నిర్వహిస్తారు. 

జూనియర్ అకౌంట్ కం టైపిస్ట్ మరియు సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాలకు మాత్రమే స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.

అన్ని ఉద్యోగాలకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ లో మార్పులు చేసుకునే అవకాశం : అక్టోబర్ 16వ తేదీ నుండి అక్టోబర్ 25వ తేదీ మధ్య అప్లికేషన్ లో మార్పులు చేసుకునే అవకాశం ఇస్తారు. నిర్దేశిత ఫీజు చెల్లించి అప్లికేషన్ లో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు చెల్లించే జీతం : సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో భర్తీ చేసే ఉద్యోగాలకు జీతం క్రింది విధంగా ఉంటుంది. 

చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్ – 35,400/- 

స్టేషన్ మాస్టర్ – 35,400/-

గూడ్స్ ట్రైన్ మేనేజర్ – 29,200/-

జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ – 29,200/-

 సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ – 29,200/-

అప్లై చేసే అభ్యర్థులకు ఉండవలసిన వయస్సు : కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 36 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు . 

వయసులో సడలింపు వివరాలు : భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం 

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఇస్తారు
OBC (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు ఇస్తారు.
PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఇస్తారు.

పరీక్ష తేదీ : ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీని ఇంకా వెల్లడించలేదు. మరికొద్ది రోజుల్లో పరీక్షా తేదీని వెల్లడిస్తారు. 

పరీక్ష భాష : పరీక్షను హిందీ , ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే కాకుండా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు తెలుగులో కూడా పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుంది.

హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీ : హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీని కూడా వెల్లడించలేదు. హాల్ టికెట్స్ విడుదల చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కు SMS లేదా ఈమెయిల్ కు సమాచారం పంపిస్తారు.

Published date : 17 Sep 2024 08:32AM
PDF

Photo Stories