Free Training : నిరుద్యోగ యువ‌త‌కు మూడునెల‌ల ఉచిత శిక్ష‌ణ‌.. వీరే అర్హులు..

ఏలూరు: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్థానిక డీఎల్‌టీసీ సహాయ సంచాలకులు ఎస్‌.ఉగాది రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాశ్‌ యోజన కింద ఆఫీస్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కోర్సులో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Guidance to Children : త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు ఇలా జాగ్ర‌త్త‌లు చెప్పాలి..!

ఇంటర్‌ ఆపైన ఉత్తీర్ణులైన వారు 15 నుంచి 30 ఏళ్ల లోపు వయసు వారు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 94934 82414 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

 

#Tags