Free training for unemployed youth: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Free training for unemployed youth

నరసరావుపేటఈస్ట్‌: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనలో భాగంగా ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌ ప్రోగ్రాం చేపట్టినట్టు జిల్లా నైపుణాభివృద్ధి అధికారి కె.సంజీవరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌/ స్కిల్‌ కళాశాలల్లో ట్రైనర్స్‌గా నియమించేందుకు అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులకు వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.

మేనేజ్‌మెంట్‌, చేతివృత్తులు, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ హార్డ్‌వేర్‌, ఐటీ–ఐటీఈఎస్‌, హెల్త్‌కేర్‌, టెలికాం, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్స్యూరెన్స్‌, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ స్కిల్డ్‌ కౌన్సిల్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర అంశాలలో శిక్షణ ఇచ్చి ట్రైనర్స్‌గా నియమించనున్నట్టు వివరించారు. వివరాలకు వీరాంజనేయులు (సెల్‌ : 9160200652) లేదా లింగంగుంట్లలోని ఎన్‌ఏసీ ట్రెనింగ్‌ సెంటర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

#Tags