Free training: ఫోన్‌ రిపేర్‌, సీసీ కెమెరా ఇన్‌స్టాలేషన్‌లో ఉచిత శిక్షణ

Free training

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నిరుద్యోగ యువకులకు కెనరా బ్యాంక్ గుడ్ న్యూస్ తెలిపింది. ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని నిరుద్యోగ యువకులు ఎవరైనాసరే పదవ తరగతి ఇంటర్ డిగ్రీ ఆపై చదువులు చదివినా లేదంటే చదువు మధ్యలో ఆపేసిన వారైనా సరే నిరుద్యోగ యువతకు నెల రోజుల పాటు సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ మరియు రిపేర్ చేయడం అదే విధంగా సెల్ ఫోన్లు రిపేర్ చేయడంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు కర్నూల్ పట్టణంలోని కల్లూరు కెనరా బ్యాంక్ రీజినల్ డైరెక్టర్ బి.శివప్రసాద్ తెలిపారు.

ఈనెల 8వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపిన ఆయన ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల రోజులపాటు సెల్ఫోన్ రిపేరీ మరియు సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ రిపేరిలో అనుభవజ్ఞులైన నిపుణులతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజన మరియు హాస్టల్ వసతి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. సెల్ ఫోన్ రిపేరింగ్మరియు సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ శిక్షణ తీసుకోవాలనుకునే అభ్యర్థులు తన బయోడేటాతో పాటు తమ ఆధార్ కార్డు తల్లిదండ్రుల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, స్టడీ సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు తీసుకొని తమ సంస్థ కార్యాలయంలో అప్లై చేసుకోవాలని తెలిపారు.

శిక్షణ తీసుకున్న అభ్యర్థులు శిక్షణ పూర్తయిన అనంతరం కెనరా బ్యాంక్ సంస్థ తరపున గుర్తింపు సర్టిఫికెట్ తో పాటు సొంతంగా బిజినెస్ చేయాలనుకునే అభ్యర్థులకు లోన్లు కూడా ఇస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు కర్నూల్ పట్టణంలోని కల్లూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్నటువంటి కెనరా బ్యాంక్ కార్యాలయంలో సంప్రదించాలని లేదా మరింత సమాచారం కోసం 90007 10508, 63044 91236 అనే నంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

#Tags