Free training in beautician course: బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ
అక్కిరెడ్డిపాలెం: హెచ్‌పీసీఎల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, బొల్లినేని మెడ్ స్కిల్ సంయుక్తంగా బ్యూటీషియన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ అసోసియేట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ మేరకు బొల్లినేని మెడ్ స్కిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్.నాగేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు.
నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్‌లోని స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్/10వ తరగతి పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్ల వయసు గల పురుషులు, మహిళలు అర్హులన్నారు.
అనుభవజ్ఞులైన శిక్షకులతో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఉచితంగా భోజనం, వసతి, యూనిఫాం, బుక్స్, ఏసీ క్యాంపస్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు.
ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బీఎస్సీ, డిప్లమో, పారా మెడికల్ కోర్సుల్లో అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు షీలానగర్ కిమ్స్ ఐకాన్‌లోని బొల్లినేని మెడ్ స్కిల్స్‌లో లేదా 91219 99654, 79930 11605లో సంప్రదించాలని సూచించారు.