Free training in Anganwadi: అంగన్‌వాడీలో ఉచిత శిక్షణ

Free training

Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగా అంగన్‌వాడీల్లోనూ ప్రవేశపెట్టిన నాడు–నేడు పథకం ఫేజ్‌–2ఏ కింద అన్నమయ్య జిల్లాలోని 11 ప్రాజెక్ట్‌ల పరిధిలో 717 అంగన్‌వాడీ కేంద్రాలకు మరమ్మతులకు సంబంధించి నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని ఐసీడీఎస్‌ పీడీ, డీపీఓ మిద్దింటి ధనలక్ష్మి తెలిపారు.

మంగళవారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయంలో మదనపల్లె, బి.కొత్తకోట, తంబళ్లపల్లె ప్రాజెక్ట్‌ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లతో సీ్త్ర శిశు, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, నాడు–నేడు కింద చేయాల్సిన పనులపై సిబ్బందికి శిక్షణా, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలోని 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని సిబ్బందికి బుధవారం కలికిరి, పీలేరు, గురువారం రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, శుక్రవారం రైల్వేకోడూరు, సుండుపల్లి, చిట్వేల్‌, రాజంపేట ప్రాజెక్ట్‌ల పరిధిలో శిక్షణా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

జిల్లాలో నాడు–నేడు పథకం ఫేజ్‌–2లో 141 నూతన భవనాలు మంజూరయ్యాయని, కో–లొకేటెడ్‌ కింద 19, శాటిలైట్‌ సెంటర్స్‌ 17, రిపేరీలు..86 కేంద్రాల్లో ఐదు స్టేజీల్లో వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయన్నారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో సుందరీకరణలో భాగంగా ఎలక్ట్రిఫికేషన్‌, తాగునీరు, ఫ్లోర్‌, టాయిలెట్స్‌, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.5లక్షల వరకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.

జిల్లాలోని 11 ప్రాజెక్టుల పరిధిలోని 2,275 అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని సేవలు సమర్థవంతంగా అందిస్తూ, పనితీరును మెరుగుపరుచుకోవడంతో... ప్రగతిలో రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా మొదటి ఐదో స్థానంలో నిలిచిందన్నారు. కార్యక్రమంలో సీడీపీఓలు సుజాత, నాగవేణి, నాగరాజు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

#Tags