Free Coaching for Group Exams: సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎక్కడంటే
స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని డీఎఫ్‌వో జీజీ నరేంద్రియన్, సబ్ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ తొమ్మిది నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణకు అవసరమైన మెటీరియల్‌ను చైన్నె నుంచి డీఎఫ్‌వో తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారన్నారు. శిక్షణ కాలంలో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే అభ్యర్థులు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. సివిల్ సర్వీసెస్, గ్రూప్– 1, గ్రూప్–2 శిక్షణ 21 ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ సొసైటీ కె. ధరణి, కోఆర్డినేటర్ బీవీఏ శ్రీకాంత్ శిక్షణ ఇస్తారన్నారు.
ఈ కార్యక్రమ పర్యవేక్షణకు ఐదుగురు సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఎంతో ఖర్చుతో కూడినదన్నారు. ప్రభుత్వమే ఉచితంగా అందించడం వల్ల శిక్షణకు ఎంపికై న అభ్యర్థులు ఎంతో అదృష్టవంతులన్నారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ తొమ్మిది నెలల పాటు పూర్తిస్థాయిలో శిక్షణ పొందేందుకు అభ్యర్థులు సిద్ధం కావాలన్నారు. ప్రతిరోజు పది గంటలకు పైబడి చదవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో (జనరల్) సీహెచ్ శ్రీనివాసరావు, యూత్ ట్రైనింగ్ సెంటర్ మేనేజర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.