ECIL jobs news: ECILలో 437 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. హైదరాబాద్‌లో పోస్టింగ్
హైదరాబాద్ లో ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నుండి 437 ట్రేడ్ అప్రెంటిస్ పోస్ట్లు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: Click Here
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: ECIL నుండి ఈనోటిఫికేషన్ విడుదల చేశారు.
భర్తీ చేస్తున్న పోస్టులు: వివిధ ట్రేడ్లలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
అర్హత : సంబంధిత ట్రెడ్ లో ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఈ పోస్టులకు తెలంగాణలో నివసిస్తున్న అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య: ఈ నోటిఫికేషన్ ద్వారా 437 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు: 18 నుండి 25 సంవత్సరాల
వయస్సులో సడలింపు: క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
అప్రెంటిస్ శిక్షణా కాలం: ఒక సంవత్సరం .
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 13-09-2024
అప్లికేషన్ చివరి తేదీ: 29-09-2024
అప్లికేషన్ విధానం: ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.
ఎంపిక విధానం: ITI లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టుల్లో 70% పోస్టులు గవర్నమెంట్ ITI విద్యార్థులతో మరియు 30% పోస్టులు ప్రైవేట్ ITI విద్యార్థులతో భర్తీ చేస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే తేదీలు:
ఎంపిక అయిన వారికి అక్టోబర్ 7 నుండి 9 తేదీల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీల వివరాలు అభ్యర్థులకు Email ద్వారా తెలియజేస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే ప్రదేశం: ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, Corporate Learning & Development Centre (CLDC), Nalanda Complex, TIFR Road, ECIL, Hyderabad – 500062.