Junior Assistant jobs: Inter అర్హతతో విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నుండి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
10వ తరగతి Inter అర్హతతో NALCOలో ఉద్యోగాలు జీతం నెలకు 70,000: Click Here
రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు: CBSE నుండి సూపరింటెండెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 212 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో పోస్టుల వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
పోస్టులు భారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. సూపరింటెండెంట్ పోస్టులు 142 మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 70 ఉన్నాయి.
విద్యార్హతలు:
సూపరింటెండెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హతతో పాటు కంప్యూటర్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ నందు నాలెడ్జ్ ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 12th అర్హతతో ఇంగ్లీషులో 35 WPM లేదా హిందీలో 30 WPM టైపింగ్ చేయగలగాలి.
వయస్సు: సూపరింటెండెంట్ , జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
సూపరింటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉండాలి.
వయస్సులో సడలింపు:
SC మరియు ST అభ్యర్థులకు వయస్సులో 5 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
సూపరింటెండెంట్ ఉద్యోగాలకు MCQ విధానంలో ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష మరియు డిస్క్రిప్టివ్ రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు MCQ విధానంలో ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష మరియు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
జీతము:
సూపరింటెండెంట్ ఉద్యోగాలకు లెవల్ – 6 ప్రకారం జీతము ఇస్తారు.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు లెవల్ – 2 ప్రకారం జీతము ఇస్తారు.
అప్లై విధానం: ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
నోటిఫికేషన్ విడుదల తేది: 31-12-2024 తేదిన CBSE నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
అప్లికేషన్ ప్రారంభ తేది: ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న ఉన్న వారు 01-01-2025 నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ చివరి తేది: ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న 31-01-2025 తేదిలోపు అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫీజు:
UR / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 800/-
SC / ST / PwBD / ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళలకు ఫీజు లేదు.