Selected Candidates : జాబ్ మేళాలో ఎంపికైన 61 మంది అభ్య‌ర్థులు..

శ్రీకాకుళం: జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో 61 మంది ఎంపికయ్యారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ గ్యారేజ్‌ వెనుక నెహ్రూ యువకేంద్రం ప్రాంగణంలో ఐఐఎఫ్‌ఎల్‌ సమస్త ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సంస్థలో వివిధ స్థాయిల ఉద్యోగాల భర్తీకిగాను జరిగిన ఈ జాబ్‌మేళాకు జిల్లా నలుమూలల నుంచి 113 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు.

Job Interviews: ఈనెల 28న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు

వీరికి వివిధ మౌఖిక పరీక్షల అనంతరం 61 మందిని ఎంపిక చేశారు. ఎంపికైనవారికి ఆ సంస్థ హెచ్‌ఆర్‌లు నాగేశ్వరరావు, రామకృష్ణన్‌రాజు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌కుమార్‌, ఎన్‌వైకే సిబ్బంది పాల్గొన్నారు.

#Tags