Telangana Employees Strike: విద్యాశాఖ KGBVS ఉద్యోగుల స‌మ్మే బాట..

employees strike

సాక్షి ఎడ్యుకేష‌న్: గ‌త 20 సంవ‌త్స‌రాలుగా అర‌కోర వేత‌నాల‌తోనే ప‌ని చేస్తున్నా విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులంతా ప్ర‌స్తుతం స‌మ్మే బాట ప‌ట్టారు. వారికి ఉన్న ప‌లు న్యాయ‌మైన డిమాండ్ల‌ను పూర్తి చేయాల‌ని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు ఉద్యోగులు.

పాఠశాలలకు, కాలేజీలకు, బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు ప్రకటన: Click Here

జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో యూఆర్‌ఎస్‌లు, కేజీబీవీల్లో పనిచేస్తున్న స్పెషల్‌ ఆఫీసర్లు, పీజీ సీఆర్టీలు, సీఆర్టీలు, ఏఎన్‌ఎంలు, అకౌంటెంట్లు, నాన్‌టీచింగ్‌ సిబ్బంది, మండల స్థాయిల్లో ఎమ్మార్సీలలో, జిల్లా స్థాయిలో ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, భవిత కేంద్రాల్లో పనిచేసే ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌పర్సన్‌ (ఐఈఆర్పీ)లు, కేర్‌గివింగ్‌ సిబ్బంది, సీఆర్పీలు, మెసెంజర్లు, పార్ట్‌టైం ఇన్స్‌స్ట్రక్టర్లు, 368మంది కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా 13 విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు ఈ ఉద్యోగులు.. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి జిల్లాకేంద్రంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నారు.

హామీలు అమలు చేయాలి..
ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదు. వినతిపత్రాలు ఇచ్చినా, నిరసన తెలిపినప్పటికీ పట్టించుకోవడం లేదు. ఎస్‌ ఎస్‌ఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ సమ్మె చేపడుతున్నాం. డిమాండ్లు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తాం.

- ఆకుదారి రాజు, ఎస్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి

డిమాండ్లు ఇవే..
● సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి. అప్పటి వరకు మినిమం టైం స్కేల్‌ వర్తింపజేయాలి.

● ప్రతి ఉద్యోగికి జీవిత బీమా రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా రూ.5 లక్షల సౌకర్యం కల్పించాలి.

● మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలి.

● 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు రూ.20లక్షల రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ప్రకటించాలి.

● సమగ్ర శిక్షలోని పీటీఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలి.

● మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
 

#Tags