Telangana VRO jobs: Inter అర్హతతో తెలంగాణాలో కొత్తగా 8వేల VRO ఉద్యోగాలు
తెలంగాణాలో రెవెన్యూ శాఖకి సంబందించిన విలేజ్ రెవెన్యూ అధికారుల వ్యవస్థను మళ్ళీ పునరుద్దరించేందుకు గానూ మరో 8,000 పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగినవారికి అవకాశం ఉంటుంది. మిగిలిన 8,000 ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
విద్యార్థులకు గుడ్‌న్యూస్ డిసెంబర్ నెలలో ఏకంగా 10 రోజులు స్కూళ్లకు సెలవులు: Click Here
పోస్టుల వివరాలు, అర్హతలు:
తెలంగాణా ప్రభుత్వం కొత్తగా ప్రతి గ్రామ పంచాయతి లో గ్రామ రెవిన్యూ అధికారులను నియమించేందుకుగానూ త్వరలో 8,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా కసరత్తు చేస్తోంది. 10+2 లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
వయస్సు:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
గ్రామ రెవిన్యూ అధికారుల పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణా ప్రభుత్వం జిల్లాలలో రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి ఒక్కటే రాత పరీక్ష ఉంటుంది.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- వరకు శాలరీస్ ఉంటాయి. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున TA, DA, HRA వంటి అన్ని అలవెన్సెస్ ఉంటాయి.
ఇబ్బందులు లేకుండా నియామకాలు:
విలేజ్ రెవిన్యూ అధికారులను ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా గతంలోని 3,000 మందిని నేరుగా రెవిన్యూ శాఖలోకి తీసుకొని, మిగిలిన 8,000 పోస్టులకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్, డిగ్రీ అర్హతలు వున్నవారికి వేర్వేరుగా రాత పరీక్ష (రెవెన్యూ సేవలే) సిలబస్ గా చేర్చి పరీక్ష పెడతారు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ 1st నుండి 7th వరకు
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
రిక్రూట్మెంట్ ఎప్పుడు విడుదల?
తెలంగాణా గ్రామ రెవెన్యూ అధికారుల ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ని త్వరలో విడుదల చేసి వెంటనే ఉద్యోగాలు ఇచ్చే విధానం తెలంగాణా ప్రభుత్వం, మంత్రి కసరత్తు చేస్తున్నారు.