Handloom Course: హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీలో డిప్లమో కోర్సుకు ఆహ్వానం

Handloom Course

ఏలూరు (టూటౌన్‌): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు వెంకటగిరిలోని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీలో డిప్లమో కోర్సు కోసం ఈ నెల 20న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని జిల్లా హ్యాండ్‌లూమ్‌, టెక్స్‌టైల్స్‌ అధికారి రఘనందన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు కాలేజ్‌ వెబ్‌సైట్‌ లేదా 94417 95408, 98661 69908, 90102 43054 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

#Tags