Bank of Baroda Recruitment 2024: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 మేనేజర్ ఉద్యోగాలు
గుజరాత్ రాష్ట్రం వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 19వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
DRDOలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: Click Here
ఖాళీల వివరాలు:
పోస్టులు: రిలేషన్‌షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితరాలు.
విభాగం: ఫైనాన్స్, ఎంఎస్‌ఎంఈ, డిజిటల్ గ్రూప్, రిసీవబుల్స్ డిపార్ట్‌మెంట్, ఐటీ, సీ అండ్ ఐసీ.
మొత్తం పోస్టుల సంఖ్య: 592
యూఆర్: 352
ఎస్సీ: 56
ఎస్టీ: 24
ఓబీసీ: 123
ఈడబ్ల్యూఎస్: 37
అర్హత:
సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/సీఎంఏ/సీఎఫ్‌ఏ, పీజీ, లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం అవసరం.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు: రూ.600
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు: రూ.100
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.11.2024
బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్: Click Here