Job fair for unemployed youth: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జాబ్‌మేళా..నెలకు రూ. 20 వేల వరకు వేతనం

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జాబ్‌మేళా
job mela

జాబ్‌మేళా తేదీ మరియు స్థలం
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 8న చింతపల్లి వైటీసీలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు.


రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు: Click Here

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పిలుపు
నిరుద్యోగ యువత ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో జాబ్‌మేళా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

పాల్గొనే కంపెనీలు
ఈ జాబ్‌మేళాలో అపోలో ఫార్మసీ, నవత రోడ్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌, కేర్‌ ఫర్‌ యూ తదితర కార్పొరేట్‌ కంపెనీలు పాల్గొంటున్నాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.

అర్హతలు మరియు వేతనాలు
జాబ్‌మేళాకు 18 ఏళ్లు నిండి 30 ఏళ్ల లోపు ఉన్న ఇంటర్‌, డిప్లామో, డిగ్రీ, బీటెక్‌, ఆపై విద్యర్హత కలిగిన యువత అర్హులుగా తెలిపారు. కంపెనీ, పోస్టుకు సంబంధించి నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల వేతనాలు ఇస్తారని చెప్పారు.

మరిన్ని వివరాలకు 8985832827, 9398338105 నంబర్లకు లేదా httpr://naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. జేసీ అభిషేక్‌ గౌడ్‌, ఐటీడీఏ పీవో అభిషేక్‌, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రోహిణి తదితరులు పాల్గొన్నారు.


జాబ్‌మేళా ముఖ్యసమాచారం:

పాల్గొనే కంపెనీలు: అపోలో ఫార్మసీ,నవత రోడ్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌,కేర్‌ ఫర్‌ యూ తదితర కంపెనీలు
వయస్సు: 18-30 ఏళ్ల లోపు అర్హులు

అర్హత: ఇంటర్‌, డిప్లామో, డిగ్రీ, బీటెక్‌
వేతనం: నెలకు రూ. 10,000- రూ. 20,000/-

మరిన్ని వివరాలకు 8985832827, 9398338105 సంప్రదించండి.

#Tags