AP AHD Recruitment 2024- ఏపీ పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు, నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ (Animal Husbandry Department)వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలోని బ్యాక్‌లాగ్‌ ఖాళీల నియామక ప్రక్రియలో భాగంగా 26 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (Assistant Surgeon) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

పోస్టులు: వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌
వేతనం: రూ.54,060/- 1,40,540/-

వయో పరిమితి: 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బి.వి. యస్‌.సి పాతాలజీ/మైక్రోబయాలజీ/పేరసైటాలజీ/ఎపిడమాలజీ/వైరాలజీ/ఇమ్యునాలజీ బయెటెక్నాలజీ/వెటర్నరీ పబ్లిక్‌ హెల్త్‌ ఏదైనా ఒక విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: 07.02.2024
మరిన్ని వివరాల కోసం https://ahd.aptonline.inను సంప్రదించండి. 
 

#Tags