Anganwadi Demands: అంగన్‌వాడీల నిరసన డిమాండ్లు ఏమిటంటే..?

Anganwadi Demands news

కై లాస్‌నగర్‌: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను పెంచాలనే డిమాండ్‌తో అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలే నిరాహర దీక్షలు మంగళవారం నాటికి రెండోరోజుకు చేరుకున్నాయి.

Anganwadi Centers Closed: మూతపడిన అంగన్‌వాడీ కేంద్రాలు..Click Here

ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూని యన్‌ జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ మాట్లాడుతూ పదవీ విరమణ పేరిట అంగన్‌వాడీలు, ఆయాలకు ప్రభుత్వం తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు.

ప్రభు త్వం జారీ చేసిన జీవోను రద్దు చేసి ప్రయో జనాలను పెంచేలా కొత్త జీవో జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

#Tags