Anganwadi Food News: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ ఎందుకంటే..
పెద్దేముల్: మండల పరిధిలోని 43 అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు చేపట్టనున్నట్లు ఎంపీడీఓ జర్నప్ప, అంగ్‌వాడీ సూపర్‌వైజర్ రాణి చెప్పారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన పెద్దేముల్, మారేపల్లి, జనగాంతో పాటు పలు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.
Anganwadi School Timings Change news: ఇక నుంచి అంగన్‌వాడీ టైమింగ్స్‌లో మార్పు
ప్రతీ కేంద్రంలో వందశాతం విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని.. వారికి సంపూర్ణ పౌష్టికాహారం అందజేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు సమయపాలన పాటించాలన్నారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మండల పరిధిలోని 59 అంగన్‌వాడీ కేంద్రాలకుగాను ప్రభుత్వం 43 కేంద్రాలల్లో మరమ్మత్తులు చేసేందుకు నిధులు మంజురయ్యాయని తెలిపారు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో విద్యుత్, టాయిలెట్స్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అంగన్‌వాడీ భవనాలకు రంగులేసి బోర్డులు ఏర్పాటు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రతన్‌సింగ్, అంగన్‌వాడీ టీచర్ రాణి తదితరులు పాల్గొన్నారు.