Job Mela: జాబ్‌మేళాలో 232 మంది ఎంపిక
నెల్లూరు (టౌన్): స్థానిక డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో శనివారం జిల్లా నైపుణ్య కల్పనా సంస్థ, కళాశాల జేకేసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 232 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ గిరి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికై న విద్యార్థులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగ మేళాకు 431 మంది హాజరైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య కల్పనా సంస్థ అధికారి విజయవినీల్ కుమార్, జేకేసీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, మెంటార్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Job Fair: జాబ్‌మేళాలో 134 మంది ఎంపిక
#Tags