Ambulance driver posts: 108లో డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తులు

108 ambulance driver posts

భువనగిరి క్రైం : 108 అంబులెన్సుల్లో ఈఎంటీ, డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మేనేజర్‌ శివరాం, ప్రోగ్రాం మేనేజర్‌ నసీరుద్దిన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈఎంటీకి సైన్స్‌ గ్రూప్‌లో డిగ్రీ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం పూర్తి చేసి 30 ఏళ్ల వయస్సులోపు వారు అర్హులుగా పేర్కొన్నారు. డ్రైవర్‌ ఉద్యోగానికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాడ్జ్‌ నంబర్‌ కలిగి ఉండాలన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 20వ తేదీ సాయంత్రం లోపు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. వివరాలకు 9154865040, 9985457070 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

#Tags