Yuva Utsav : వైవీయూలో యువ ఉత్స‌వ్‌.. ఈ విభాగాల్లో పోటీలు

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో త్వరలో నిర్వహించనున్న ‘యువ ఉత్సవ్‌’ కార్యక్రమంలో పాల్గొనేందుకు యువత నుంచి ఎంట్రీలు ఆహ్వానిస్తున్నట్లు నెహ్రూయువ కేంద్రం జిల్లా అధికారి కె. మణికంఠ తెలిపారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ, నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో వైవీయూలో ఈ యువ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Medical Jobs: నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

యువ ఉత్సవ్‌లో భాగంగా ఇండియా –2047 అన్న అంశంపై పెయింటింగ్‌, కవిత్వం, మొబైల్‌ ఫొటోగ్రఫీ, డిక్లేమసిన్‌ విభాగాల్లో వ్యక్తిగత పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా కల్చరల్‌ ట్రెడిషనల్‌, ఫోక్‌, సైన్స్‌ ఎగ్జిబిషన్‌ మేళా పోటీలు గ్రూప్‌, వ్యక్తిగత విభాగాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల యువత తమ వివరాలను 9177616677 నెంబర్లలో సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags